గ్యాంగ్ స్టర్ గా ప్రభాస్‌..

218
- Advertisement -

రాజుల కాలం నాటి మేక‌ప్‌కు ఇప్పుడు గుడ్‌బై చెప్పేస్తున్నాడు రెబల్‌ స్టార్‌. ఐదేళ్ల‌పాటు బాహుబ‌లి ప్రాజెక్టుతో బిజీగా గ‌డిపిన ప్ర‌భాస్, మ‌ళ్లీ త‌న ఒరిజిన‌ల్ లుక్‌తో తన డార్లింగ్స్‌ని మిస్మరైజ్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. బాహుబ‌లి త‌ర్వాత యూవీ బ్యాన‌ర్‌లో చిత్రం చేసేందుకు ఇప్ప‌టికే రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.
prabhasa gangstur in saho movie
రన్ రాజ్ ర‌న్ ఫేమ్ డైరెక్ట‌ర్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి సాహో అనే టైటిల్ ను ఫిక్స్‌ చెసిట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. అయితే ఈ సినిమాలో ప్రభాస్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా.. ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్న‌ట్లు  కూడా ఫిలింన‌గ‌ర్‌లో వార్త షికారు చేస్తోంది. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే డార్లింగ్ ఫ్సాన్స్‌ కి పండగే.

ఈ చిత్రానికి శంకర్-ఎహసాన్-లాయ్ త్ర‌యం మ్యూజిక్‌ అందిస్తోంది. రూ.150 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న‌ సాహో చిత్ర టీజర్ ను బాహుబలి 2 చిత్రంతో పాటు విడుదల చేయ‌నున్నారు. ఇక బాహుబలి కి గుడ్ బాయ్ చెప్పేసి గ్యాంగ్ స్టర్ గా మారబోతున్న ప్రభాస్ కోసం అభిమానులు వెయ్యిక‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు.

- Advertisement -