బాహుబలి’ సినిమా కంటే ముందే జక్కన్న రాజమౌళి దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఆయన రూపొందించిన ‘మగధీర’, ‘ఈగ’ సినిమాలు ఆయనను నేషనల్ వైడ్‌గా పాపులర్ చేశాయి. ఇక, ‘బాహుబలి’ ఆయన ఇమేజ్ను అమాంతంగా పైకి లేపింది. అంత ఇమేజ్ను సొంతం చేసుకున్న రాజమౌళి ‘బాహుబలి-2’ తర్వాత చేయబోయే సినిమా ఏంటనేది ఆసక్తికరంగా మారింది. బాహుబలి 2 ఫైనల్ స్టేజ్‌కు వచ్చినా..నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనేది మాత్రం రాజమౌళి ఇంతకు వరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాజాగా జక్కన ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
బాహుబలి 2 తర్వాత జక్కన్న ఇకపై తెలుగు హీరోలతో సోలోగా సినిమాలు చేయడానికి సిద్ధంగా లేడని జోరుగా వార్తలు వస్తున్నాయి. జాతీయ స్థాయిలో మార్కెట్ ఏర్పరుచుకున్నాక తెలుగు హీరోలతో ప్రాంతీయ సినిమాలు చేయాలని ఏ దర్శకుడూ అనుకోడు. అందుకే జక్కన్న కూడా జాతీయ స్థాయిలో సినిమాల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. అందుకే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్‌తో సినిమా చేయాలని రాజమౌళి భావిస్తున్నారట.
అమీర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే..రాజమౌళి తర్వాతి సినిమా ఆయనతోనేనని ప్రచారం జరుగుతోంది. కానీ, అమీర్ కొన్ని రోజులు ఆగమంటే మాత్రం ‘ఈగ-2’ను ప్రారంభించాలనే ఆలోచన ఉందట. ‘ఈగ-2’ను కూడా జాతీయ స్థాయిలో చాలా భారీగానే తీస్తారట. ఇకపోతే, మహేష్‌తో ఓ సినిమా చేయాలని రాజమౌళి ఎప్పుడో ఒప్పందం కుదుర్చుకున్నాడు..కాబట్టి మహేష్ తోనే ఓ సినిమా ఉండనున్నట్టు తెలుస్తోంది.