దేశంలో కరోనా,ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తయయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమల్లోకి రాగా నిబంధనలను కఠినతరం చేశారు. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో థియేటర్స్ మూసివేశారు. దీంతో సంక్రాంతి రేసులో ఉన్న పాన్ ఇండియా సినిమాల రిలీజ్ సందిగ్దంలో పడింది.
తాజాగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ విడుదల తేదీ మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. పలుమార్లు వాయిదా అనంతరం ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ కరోనా కారణంగా ఈ మూవీ విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
ఇప్పటికే ఈ సినిమాని 30 జూలై 2020, 8 జనవరి 2021, 13 అక్టోబర్ 2021 డేట్స్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ కరోనా కారణంగా వాయిదా పడగా తాజాగా అలాంటి పరిస్ధితే ఎదురైంది.