భూకంపం..కుమార్తెను కాపాడి!

1
- Advertisement -

వెనిజులాను భారీ భూకంపాలు అతలాకుతలం చేశాయి. భూకంప ప్రభావంతో వందల సంఖ్యలో ప్రజలు మరణించగా పెద్ద పెద్ద భవనాలు నెలకొరిగాయి. భూకంపాల సమయంలో తన కుమార్తె ప్రాణాలను కాపాడుతూ ఒక తల్లి మరణించింది. ఆండ్రియా అనే మహిళ తన చిన్నారి ప్రాణాలను కాపాడటానికి తన ప్రాణాలు కొల్పోయిందని స్థానిక మీడియా వెల్లడించింది.

నువ్వు ఆమెను ఎలా కాపాడావో, నీ ప్రాణాలను ఎలా అర్పించావో, నీ చివరి శ్వాస వరకు ఆమెను వదలకుండా ఎంత ధైర్యవంతమైన మహిళగా నిలిచావో ఆ కథను నేను ఆమెకు చెప్తాను అని బెల్లో తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

మరోవైపు భూకంపం ధాటికి శిథిలాల కింద చిక్కుకున్న ప్రాణాలతో ఉన్నవారిని వెలికితీసేందుకు రెస్క్యూ సిబ్బంది ఇంకా శ్రమిస్తూనే ఉన్నారు. మరణించిన వారిలో ఇద్దరు ఫుట్‌బాల్ ఆటగాళ్లు కూడా ఉన్నట్లు వెనిజులా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (FVF) తెలిపాయి. కరాకస్ ఫుట్‌బాల్ క్లబ్ తన అండర్-18 ఆటగాడు రజాన్ సిజా, లా గుఐరాలోని తన ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి మరణించాడని తెలిపింది.

ALso Read;ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’

మాజీ మిస్ వెనిజులా గిసెల్ రేయ్స్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో…లా గుఐరాలో జంట భూకంపాల కారణంగా తన తల్లి నివసిస్తున్న భవనం “పూర్తిగా కూలిపోవడంతో” ఆమె మరణించిందని తెలిపారు.

- Advertisement -