రాజమౌళి కంటతడి..

173
rajamouli cries at bahubali 2
rajamouli cries at bahubali 2
- Advertisement -

బాహుబలి డైరెక్టర్ రాజమౌళిని సంగీత దర్శకుడు కీరవాణి కంటతడి పెట్టించారు. బాహుబలి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో రాజమౌళిపై ఓ పాట రూపొందించి పాడారు. రాజమౌళి కన్నీరు పెట్టుకోవడాన్ని ఆయన కుమార్తె చూడలేకపోయిన ఘటన ‘బాహుబలి- ది కన్ క్లూజన్’ సందర్భంగా చోటుచేసుకుంది. రాజమౌళి ఎందుకు కన్నీరు పెట్టుకోవాల్సి వచ్చిందనుకుంటున్నారా?…

‘బాహుబలి- ది కన్ క్లూజన్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా, కీరవాణి మాట్లాడుతున్నప్పుడు తమ్ముడి (రాజమౌళి) ప్రతిభను కీర్తిస్తూ, ఒక పాటను రచించి, పాడి వినిపించారు.

‘ఎవ్వడంట ఎవ్వడంట..? బాహుబలి తీసింది
మా పిన్నికి పుట్టాడు ఈ నంది కాని నంది
ఎవ్వరూ కనంది.. ఎక్కడా వినంది
శివుని ఆన అయ్యిందేమో హిట్లు మీద హిట్లు వచ్చి ఇంతవాడు అయ్యింది
పెంచింది రాజనందిని.. కొండంత కన్న ప్రేమతో..
ఎంతెంత పైకి ఎదిగినా అంతంత ఒదుగు వాడిగా..!
చిరాయువై యశస్సుతో ఇలాగే సాగిపొమ్మని పెద్దన్న నోటి దీవెన శివుణ్ణి కోరు ప్రార్థన..

చిరకాలం వర్ధిల్లు అంటూ మనసారా దీవించారు. ఆ సమయంలో పెద్దన్నయ్య నోట పొగడ్తలు విన్న రాజమౌళి తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యాడు. వేదికపై నుంచి కళ్లు తుడుచుకుంటూ కిందికి దిగాడు. తండ్రి కన్నీరు పెట్టుకోవడం చూసిన రాజమౌళి కుమార్తె తండ్రి దగ్గరకెళ్లి, గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది. దీంతో అందరి కళ్లు చెమర్చగా, రాజమౌళి కూతుర్ని సముదాయించారు.

రాజమౌళిలో ఇంతవరకు ఈ యాంగిల్ ని చూడని నిర్మాతలు, నటులు అంతా విస్మయం చెందారు. దీంతో అంతా రాజమౌళిని ఓదార్చారు. కీరవాణి స్టేజిపైన ఉన్నంత సేపూ కార్యక్రమానికి హాజరైనవారంతా ఎమోషనల్‌ అయ్యారు.

- Advertisement -