ప్రభాస్‌కు అవేమీ చేతకాదు..!

241
Bahubali pre release event
Bahubali pre release event
- Advertisement -

‘ఎవ్వడంట ఎవ్వడంట.. బాహుబలి తీసింది’ అని పాట పాడుతూ చేసిన కీరవాణి ప్రసంగం ఉద్వేగభరితంగా నడిచి బాహుబలి: ద కనక్లూజన్‌ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు హైలైట్‌గా నిలిచింది. ఆదివారం రాత్రి రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘బాహుబలి: ద కనక్లూజన’ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన కన్నుల పండువగా జరిగింది. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని యస్‌.యస్‌. రాజమౌళి రూపొందించారు. ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించగా, కె. రాఘవేంద్రరావు సమర్పిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.

పాట అయ్యాక ‘గాడ్‌ బ్లెస్‌ యూ’ అని ‘తమ్ముడిని పొగడకూడదు. దీవించాలి’ అంటూ రాజమౌళిని రిలాక్స్‌ అవ్వమని కిందకు పంపించారు కీరవాణి. తర్వాత ప్రభాస్‌ గురించి మాట్లాడుతూ… ‘‘ప్రభా్‌సలో ఏం ఉందో మీకు తెలుసు. అతనిలో ఏం లేదో నాకు తెలుసు. తనకు గర్వం లేదు. మామూలుగా హీరో అంటే కొంచెం స్టైల్‌ కొడుతూ ఉండాలి. ఆడియో రిలీజ్‌ ఫంక్షనలో వాళ్లకు ఇష్టంలేని వాళ్లను చూస్తే.. ఇంకో వైపుకు తిరుగుతుండాలి. ఇట్లాంటి కంత్రీ పనులు చేస్తేనే కదా హీరో అనేది. నాకు మొదట్నించీ హీరోకు నిర్వచనం అదేనని తెలుసు. అంటే.. అందరు హీరోలు కాదనుకోండి. వాటిలో ప్రభాస్‌కు ఏమీ చేతకాదు. అలాంటివాడ్ని హీరో అని ఎలా అనమంటారు! అతనికేం ఉందంటే.. మంచి మనసుంది. దైవ బలం ఉంది’’ అని చెప్పారు కీరవాణి.
DSC_2976
ప్రభాస్‌ మాట్లాడుతూ ‘‘అభిమానులు రెండేళ్లకో సినిమా, రెండున్నర ఏళ్లకో సినిమా చూశారు. ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేస్తాను. హిందీలో ఈ సినిమాను విడుదల చెయ్యడానికి అన్ని రకాలుగా సహాయపడుతూ అక్కడి మార్కెట్‌ పెంచిన కరణ్‌జోహార్‌కి మెనీ థ్యాంక్స్‌’’ అన్నారు. ‘వాడిది తప్పు అని తేలింది. తల తెగింది’, ‘నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేడు మామా’ అంటూ సినిమాలోని రెండు డైలాగ్‌లు చెప్పి అభిమానుల్ని ఆయన ఉర్రూతలూగించారు.

DSC_2966

కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘అసలైన ఉగాది ఏప్రిల్‌ 28న వస్తుంది. ఈ ఏడాదిని ‘బాహుబలి’ నామ సంవత్సరం అంటారు. ఏదేమైనా ఈ సినిమా విజయవంతంగా పూర్తి కావడానికి ముగ్గురు శివగామిలు కారణం. వారు రమ్యకృష్ణ, రమ (రాజమౌళి భార్య), శ్రీవల్లి (కీరవాణి భార్య). బాహుబలి-3 తీస్తే అందులో ఒక్క షాట్‌ అయినా డైరెక్ట్‌ చేసే అవకాశం ఇవ్వు రాజమౌళీ’’ అని కోరారు.

భారతీయ సినిమాపై వ్యాఖ్యలు చేసిన హాలీవుడ్‌ దర్శకుడు ఇప్పుడు ఒకసారి బాహుబలి చూడాలని సూచించారు సీనియర్‌ నటుడు కృష్ణంరాజు. ‘‘నాకు పరిచయమున్న రాజకీయనాయకులు కూడా ఈ సినిమా బడ్జెట్‌ గురించి మాట్లాడుతూ హేళన చేశారు. అదే రాజకీయ నాయకులు ఇప్పుడు ‘బాహుబలి’ గురించి తెలుగు సినిమా గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ఆ క్రెడిట్‌ రాజమౌళికి దక్కుతుంది. ఆయన స్పీల్‌బర్గ్‌ అంత గొప్పవాడవుతాడని నేను అనను. అంతకు మించి గొప్పవాడు అవుతాడేమో! ఈ సినిమాతో ప్రభాస్‌ నూటికి ఎనభై శాతం నేచురల్‌ ఆర్టి్‌స్టగా మారాడు’’ అని అన్నారు కృష్ణంరాజు.

రాజమౌళి మాట్లాడుతూ ‘‘నాకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ గురించి చెప్పింది, నేర్పించింది వి.ఎ్‌ఫ.ఎక్స్‌ సూపర్‌వైజర్‌ కమల్‌ కణ్ణన. సెకండ్‌ యూనిట్‌లో చాలా సీన్లను కార్తికేయ డైరెక్ట్‌ చేశాడు. నేను కమర్షియల్‌ సినిమాలు చేస్తూ, కమర్షియల్‌ హీరోయిజంను ఎలివేట్‌ చేస్తూ, నాకు నచ్చిన విధంగా సినిమాలు తీసుకుంటూ వచ్చాను. హీరోయిజంను నెక్స్‌ట్‌ లెవల్‌కు తీసుకెళ్తూ వచ్చాను. ‘ప్రతి సినిమాలో ప్రతి హీరోకు ఒక ఎలివేషన ఇచ్చాను కదా.. ప్రభా్‌సకు నేనేమిచ్చాను?’ అని ప్రశ్నించుకుంటే.. సమాధానం ముంబైలో దొరికింది. అక్కడి మీడియా ప్రభాస్‌ను చూసి కేకలు వేస్తున్నారు. అది చూసి గర్వంగా ఫీలయ్యా’’ అన్నారు.

DSC_2371

బాహుబలి లాంటి చిత్రంలో నటించే అవకాశం జీవితంలో ఒకసారి మాత్రమే వస్తుందని అన్నారు కథానాయిక తమన్నా. తనకు అవకాశం ఇచ్చిన నిర్మాతలు, దర్శకుడు రాజమౌళి, చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపారు.

రాజమౌళి అభివృద్ధి చూస్తుంటే ఆయన్ను జేమ్స్‌ కామెరూన్‌ ఆఫ్‌ టాలీవుడ్‌ అనడం కాదని, జేమ్స్‌ కామెరూన్‌ ఆఫ్‌ హాలీవుడ్‌ అంటారని ఛాయగ్రాహకుడు సెంథిల్‌కుమార్ అన్నారు ‌. ‘ ‘బాహుబలి’ చిత్రంలో భాగస్వామిని కావడం వల్ల నేను చాలా గర్విస్తున్నా. దర్శకుడు రాజమౌళికి కృతజ్ఞతలు. రాజమౌళి ఇలాగే వెళ్తుంటే ఆయన్ను జేమ్స్‌ కామెరూన్‌ ఆఫ్‌ టాలీవుడ్‌ కాదు.. జేమ్స్‌ కామెరూన్‌ ఆఫ్‌ హాలీవుడ్‌ అంటారు. ఆయన అభివృద్ధి చూస్తే ఇలాగే అనిపిస్తుంది. శోభుగారు, ప్రసాద్‌లాగా వేరే ఎవరూ ఉండరు. ఈ సినిమాతో అందరి జాతకాలూ మారిపోయాయి. ప్రభాస్‌ గురించి ఏం చెప్పాలండీ.. చాలా బిగ్గెస్ట్‌ స్టార్‌ ఇన్‌ ఇండియా. చాలా వినమ్రంగా ఉంటారు. చిత్ర బృందం చాలా కష్టపడి పనిచేసింది. కెమేరా విభాగం చాలా కష్టపడిన పనిచేశారు. జై మాహిష్మతి’ అంటూ ముగించారు.

26brk170a

‘‘గడచిన ఐదేళ్లలో ఆయన సాధించిన దానితో పోలిస్తే నేను సాధించింది పదో వంతే. ఇది ‘బాహుబలి: కనక్లూజన’ కాదు. దేశంలోని వేలాది మంది ఔత్సాహిక దర్శకులకు స్ఫూర్తినిచ్చిన ప్రారంభం’’ అని కరణ్‌ జోహార్‌ తెలిపారు.

- Advertisement -