ఈగిల్ ఐ ఎంట‌ర్ టైన్ మెంట్స్ మరో మూవీ..

43
eagle eye

న‌రేన్ వ‌న‌ప‌ర్తి హీరోగా ప‌రిచ‌యం అవుతూ రూపొందిన ఊరికి ఉత్త‌రాన‌ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇటు విమ‌ర్శ‌కుల నుంచి అటు ప్రేక్ష‌కుల నుంచి మంచి ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ విజ‌యం ఇచ్చిన ఉత్సాహంతో ఈగిల్ ఐ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-2గా మ‌రో చిత్రాన్ని రూపొందించ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే ఈచిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ కూడా పూర్తి కావొచ్చింది.

ఈ సంద‌ర్భంగా హీరో , చిత్ర స‌మ‌ర్ప‌కులు న‌రేన్ వ‌న‌ప‌ర్తి మాట్లాడుతూ… మాఊరికి ఉత్త‌రాన‌` చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రించారు. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా ల‌భించాయి. కొత్తవారైనా కంటెంట్ ఉంటే సినిమాను ఆద‌రిస్తార‌ని మా చిత్రం మ‌రోసారి నిరూపించింది. `ఊరికి ఉత్త‌రాన‌` స‌క్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో ఈగిల్ ఐ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-2 గా మ‌రో చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం. త్వ‌ర‌లో ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ తో పాటు కాస్ట్ అండ్ క్రూ డీటైల్స్ ప్ర‌క‌టిస్తాం అన్నారు.