రాజమౌళి ముఖ్య అతిథిగా

186
- Advertisement -

నాని సమర్పణలో అడివి శేష్ హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన ‘హిట్2’ డిసెంబర్ 2న థియేటర్స్ లోకి రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీం ప్రమోషన్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి సోషల్ మీడియా లో హంగామా చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. నెలాఖరున భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కి ఇండియన్ సినిమాలో టాప్ డైరెక్టర్ అనిపించుకుంటున్న రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడు.

రాజమౌళి కి నాని మంచి రిలేషన్ ఉంది. నాని తో జక్కన్న ఈగ అనే సినిమా చేశాడు. అప్పటి నుండి ఇప్పటి వరకూ నాని రాజమౌళి ఫ్యామిలీ లో ఒకడిగా ఉంటున్నాడు. అందుకే నాని నిర్మాణంలో తెరకెక్కిన ఈ హిట్ 2 పై హైప్ క్రియేట్ చేయడం కోసం తన వంతుగా ప్రమోషన్ చేయబోతున్నాడు. ఇక శేష్ తో కూడా రాజమౌళికి మంచి అనుబంధం ఉంది.

బాహుబలి తో శేష్ ఓ ప్రత్యేక పాత్రలో నటించాడు. ఆ మధ్య శేష్ సినిమా ఓపెనింగ్ కి కూడా గెస్ట్ గా విచ్చేశాడు రాజమౌళి. మరి హిట్2 ఈవెంట్ ద్వారా మరోసారి శేష్ ని సపోర్ట్ చేయబోతున్నాడు. త్వరలోనే ప్రీ రిలీజ్ డేట్ తో పాటు డీటెయిల్స్ బయటికి రానున్నాయి.

ఇవి కూడా చదవండి…

కేజీఎఫ్‌-2కు రికార్డు దగ్గరలో…

ఆ పోస్టులు మాకొద్దు బాబోయ్‌..బండిపై అసహనం!

కథలు దొంగలిస్తాను…విజయేంద్రప్రసాద్ షాకింగ్!

- Advertisement -