కష్టపడి సినిమా తీశాం.. దయచేసి ఆపకండి

214
Rajamouli appeals to Kannadigas
Rajamouli appeals to Kannadigas
- Advertisement -

‘బాహుబలి-2 కన్ క్లూజన్’ సినిమాను దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయాలని, పక్కా ప్రణాళికతో భారీ ప్రచారం నిర్వహిస్తున్న రాజమౌళికి కన్నడనాట షాక్ తప్పేలా కనిపించడం లేదు. గతంలో సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని కర్ణాటకకు చెందిన ఒకోటా సంస్థ బీష్మించుకుని కూర్చుంది. పదేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రాద్ధాంతం ఎందుకు? అని రాజమౌళి సదరు సంస్థకు ప్రశ్న సంధిస్తూ, సర్దుకుపోవాలని సూచించిన సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటక సంఘాలు మరింత మండిపడుతున్నాయి. వివాదం సద్దుమణగాలంటే కట్టప్పతో క్షమాపణలు చెప్పించాలని ఒకోటా సంస్థ డిమాండ్ చేస్తోంది. లేని పక్షంలో సినిమా విడుదల రోజు బంద్ కు పిలుపునిస్తున్నామని ఆ సంస్థ ప్రకటించింది.

SS-rajamouli-Baahubali-making (1)(1)

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో రిలీజ్ కాకపోతే కలెక్షన్ల ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో తన సోషల్ మీడియా పేజ్ లో ఓ వీడియో పోస్ట్ చేసిన రాజమౌళి కన్నడలో మాట్లాడి వారికి మరింత చేరువయ్యే ప్రయత్నం చేశాడు. నాకు కన్నడ సరిగా రాదన్న రాజమౌళి.. ఏవైనా తప్పులుంటే క్షమించండి అంటూ ప్రారంభించాడు. ఎప్పుడో సత్యరాజ్ చేసిన వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సినిమాను అడ్డుకోవడం సరికాదన్నారు. ఆ సమయంలో సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అన్న రాజమౌళి.. వాటితో బాహుబలి యూనిట్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. సినిమా కోసం ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు ఐదేళ్లుగా కష్టపడి పని చేశారు. రిలీజ్ అడ్డుకుంటే అందరూ నష్టపోవాల్సి వస్తుందని, బాహుబలి తొలి భాగాన్ని ఆదరించినట్టుగానే కన్నడ ప్రేక్షకులు బాహుబలి రెండో భాగాన్ని కూడా ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

కాగా, ఇప్పటికే ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సహకరించేందుకు రాజమౌళి సైతం కన్నడిగులకు సారీ చెప్పినా.. కన్నడిగులు మాత్రం శాంతించడం లేదు. ఇలాంటి చర్యలు వల్ల బారీ బడ్జెట్ తో తీసే సినిమాపై చాలా ప్రభావం పడే అవకాశం ఉంది.

- Advertisement -