హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కేవలం కేసీఆర్‌ను దెబ్బకొట్టేందుకు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గెలిపించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని చేజేతులా బొందపెట్టే పరిస్థితి తీసుకువచ్చాడు. వరుసగా దండోరా సభలు, జంగ్ సైరన్‌లతో చచ్చిపోయిన కాంగ్రెస్‌కు ఊపిరి పోసి వచ్చే ఎన్నికల్లో అధికారం వస్తుందని ఊరించిన రేవంత్ రెడ్డి తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం హస్తం పార్టీకి శాపంగా మారింది. వరుసగా ఎమ్మెల్సీ ఎన్నికలు, సాగర్ ఉప ఎన్నికల్లో ఓటమితో బీజేపీది వాపే కాని బలుపు కాదని తేలిపోయింది. ఈ టైమ్‌లో పార్టీకి వచ్చిన ఊపును కంటిన్యూ చేస్తూ బీజేపీని పూర్తిగా తొక్కేసే అవకాశాన్ని రేవంత్ రెడ్డి చేజేతులా వదులుకున్నాడు. హుజురాబాద్‌లో గెలిచినా, ఓడినా టీఆర్ఎస్‌కు పోయేది లేదు..అదే బీజేపీ గెలిస్తే ఆ పార్టీకి మళ్లీ ఊపు ఇచ్చినట్లు అవుతోంది… టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అని బండి బ్యాచ్ రెచ్చిపోతుంది…ఇదే వూపులో మళ్లీ కాంగ్రెస్ పార్టీని తొక్కేస్తుంది..రాజకీయాల్లో నా అంత తెలివిగల్లోడు లేడని విర్రవీగే రేవంత్ రెడ్డి ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడో కాంగ్రెస్ నేతలకు కూడా అర్థం కావడం లేదు.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో త్వరలో మరో రెండు ఉప ఎన్నికలు వస్తాయని బీజేపీ నేతలు కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. హుజురాబాద్‌లో గెలిచిన ఊపుతో రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు తీసుకువచ్చేందుకు కాషాయనేతలు కంత్రీ ప్లాన్ వేస్తున్నరు. ఈమేరకు సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కాషాయ నేతలు కన్నేసారు. ముందుగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని బీజేపీలోకి లాగేందుకు బండి బ్యాచ్ ప్రయత్నాలు షురూ చేసింది. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి బ్రదర్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటూ రేవంత్‌పై పోరాటం చేస్తుండగా…ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాత్రం బీజేపీలో చేరాలని భావిస్తున్నట్లు సమాచారం. గతంలోనే కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని ప్రకటించిన ఆయన.. రాష్ట్రంలో టీఆర్ఎస్‌తో పోరాడే శక్తి బీజేపీకే ఉందని వ్యాఖ్యానించాడు. రాజగోపాల్ రెడ్డిని బీజేపీలోకి చేర్చుకునేందుకు ఇదే రైట్ టైమ్ అని ఢిల్లీ పెద్దలు సైతం భావిస్తున్నారంట..
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీ నుంచి మళ్లీ పోటీ చేస్తే హుజురాబాద్ తరహాలో గెలవడం ఖాయమని తెలంగాణ బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారంట…దీంతో ఆయన్ని బీజేపీలోకి లాగే పనిలో పడ్డారంట.. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే కాంగ్రెస్ పార్టీ చాప్టర్ క్లోజ్ అవడం ఖాయమని ఆ పార్టీ నేతలే అంటున్నారంట..మొత్తంగా హుజురాబాద్‌లో బీజేపీని గెలిపించి ఎంత పొరపాటు చేసానో రేవంత్ రెడ్డికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. హుజురాబాద్‌లో ఓడినా టీఆర్ఎస్‌కు పెద్దగా పోయేదేం లేదని, కేసీఆర్ వ్యూహాలు ఊహించలేమని, ఎన్నికల టైమ్‌లో ఏదో ఒక మ్యాజిక్ చేసి రాజకీయాన్ని తిప్పేస్తారని, అనవసరంగా బీజేపీకి ఛాన్స్ ఇచ్చి మన పార్టీని పూర్తిగా బొందపెట్టే పరిస్థితి తీసుకువచ్చావని రేవంత్‌పై కాంగ్రెస్ సీనియర్లు మండిపడుతున్నారంట..అందుకే అంటారు…అతిగా ఆవేశపడే మగాడు బాగుపడ్డట్లు చరిత్రలో లేదని రేవంత్‌ను చూస్తే అర్థమవుతోంది…పాపం రేవంత్.. చచ్చిపోయే కాంగ్రెస్ పార్టీకి ముందుగానే చితిని పేరుస్తున్న కాటికాపరిలా అయిపోయాడనే చెప్పాలి.