టాక్సీవాలా కథ.. ఆ హీరో చేయ‌న‌న్నారు…

238
raj tharun not intrested taxiwala story
- Advertisement -

టాక్సీవాలా సినిమాలో విజయదేవర కొండ హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ స్టోరీ విజయ్ దేవరకొండ కంటే ముందు రాజ్‎తరుణ్‎కి వినిపించారు. కానీ రాజ్‎తరుణ్ ఆ కథకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. శరీరం నుంచి ఆత్మవేరుగా వెళ్లి రావడం. కారులో దెయ్యం అనే అంశాలు రాజ్ తరుణ్‎ను ఆలోచనలో ప‌డేశాయ‌ని స‌మాచారం. ఇప్పటికే ఆ రెండు అంశాలతో కూడిన సినిమాలు గతంలో వచ్చాయని ఈ యంగ్ హీరో ఈ కథపై ఆసక్తి చూపించ‌లేద‌ని తెలుస్తోంది.

raj tharun not intrested taxiwala story

దాంతో ఈ కథను మరోయంగ్ హీరో విజయ్ దేవర కొండకు వినిపించగానే విజయ్ ఓకే చెప్పేశాడని సమాచారం. సైంటిఫిక్ థ్రిల్లర్‎గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టీజర్ తో టాక్సీవాలా టీం ప్రేక్షకులలో ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది. విజయ్ దేవరకొండకు మరో అర్జున్‎రెడ్డి మూవీలా హిట్ అవుతుందని ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది. వచ్చేనెల 18న ఈ మూవీని రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది.

అయితే కొన్ని సందర్భాలలో ఒక హీరో చేయాల్సిన మూవీ మరో హీరో చేయడం సహజంగా జరుగుతుంటాయి. ఆ హీరో వదులుకున్న మూవీ మరో హీరోకి మంచి విజయాన్ని అందించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా రాజ్ తరుణ్ వదులుకున్న టాక్సీవాలా హిట్ అయితే… రాజ్ తరుణ్ ఒక సక్సెస్ మిస్ అయినట్లే అవుతుంది.

- Advertisement -