భరత్ అనే మూవీ చూసిన మంత్రి కేటీఆర్‌

217
KTR watched Mahesh Babu's Bharat Ane Nenu Movie
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భరత్ అనే నేను. విడుదలైన ఫస్ట్ డే నుంచే హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. ఇప్పటివరకు 130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన భరత్ అనే నేను తెలుగు రాష్ట్రాలలోనే కాదు ఓవర్సిస్‌లోనూ సత్తాచాటుతోంది.

ఇక ఇవాళ మంత్రి కేటీఆర్‌ భరత్‌ అనే నేను మూవీ చూశారు. సక్సెస్ వేడుకల్లో భాగంగా మహేష్‌,దర్శకుడు కొరటాలతో పాటు సినిమాను చూశారు. నా స్నేహితుడు మహష్ బాబు నటించిన సినిమా చూశానని చాలా బాగుందని తెలిపారు. సినిమా చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేశానని తెలిపారు.

KTR watched Mahesh Babu's Bharat Ane Nenu Movie

ఇక సినిమా చూసినందుకు ధన్యవాదాలు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు మహేష్‌. మీ విలువైన సమయాన్ని కేటాయించి, ‘భరత్ అనే నేను’ సినిమాను చూసినందుకు, తమ ప్రయత్నాలను ప్రశంసించినందుకు ధన్యవాదాలు అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.

KTR watched Mahesh Babu's Bharat Ane Nenu Movie

ఇదిఇలా ఉండగా మంత్రి కేటీఆర్‌,మహేష్ బెస్ట్ ఫ్రెండ్స్‌ అని తెలిసిన సంగతి తెలిసిందే. శ్రీమంతుడు సినిమా తర్వాత తెలంగాణలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కేటీఆర్‌ కోరగా మహేష్‌ వెంటనే స్పందించి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తూరు మండలంలోని సిద్ధాపురం గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -