ఓటీటీ బాట ప‌ట్టిన టాలీవుడ్‌ యంగ్‌ హీరో..

157
Raj Tarun
- Advertisement -

యంగ్ హీరో రాజ్ తరుణ్ గత కొంత కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. ఇటీవ‌ల వ‌చ్చిన అత‌డి సినిమా స్టాండ‌ప్ రాహుల్ కూడా పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. అనుభ‌వించు రాజా కూడా పెద్ద ప్లాప్‌. దీంతో ఇప్పుడు రాజ్ త‌రుణ్ వెండితెర‌ను కాద‌నుకుని ఓటీటీ బాట ప‌ట్టేశాడు. వ‌రుస‌గా వెబ్ సీరిస్‌లు చేస్తున్నాడు. తమడ మీడియా మరియు జీ5 సంయుక్తంగా నిర్మించబోయే ఓ వెబ్ సీరీస్‌లో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్నాడు.అల్ల‌రి న‌రేష్ హిట్ మూవీ అహ‌నా పెళ్లంట టైటిల్‌తో వ‌స్తోన్న ఈ సినిమాకు సంజీవ్ రెడ్డి ద‌ర్శ‌కుడు. మ‌రో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాలో రాజ్ త‌రుణ్ స‌ర‌స‌న స్టార్ హీరో రాజ‌శేఖ‌ర్ కుమార్తె శివానీ రాజ‌శేఖ‌ర్ న‌టిస్తోంది. అలాగే సీనియ‌ర్ న‌టి ఆమ‌నితో పాటు పోసాని కృష్ణ‌ముర‌ళీ త‌దిత‌రులు కూడా కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తున్నారు.

ఈ వెబ్‌ సిరీస్‌ రాజమండ్రి, పరిసర ప్రాంతాలలో 15 రోజుల పాటు షూటింగ్‌ జరుపుకుంటుంది. రాజ్‌తరుణ్‌ తొలిసారిగా వెబ్‌సిరీస్‌లో నటించడం వెబ్‌ సిరీస్‌లకు ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనం. ఈ మధ్య కాలంలో అన్ని భాషలలోని హీరోలు సైతం ఈ వెబ్ సిరీస్‌లలో నటించడానికి ఆసక్తిని కనపరుస్తున్నారు. ఈ జీ5 ఒరిజినల్ వెబ్ సిరీస్.. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించేదిగా ఉంటుంది. కామెడీ డ్రామా, రొమాన్స్‌లతో సాగే ఈ వెబ్‌ సిరీస్‌ 30 నిమిషాల నిడివితో 8 ఎపిసోడ్స్‌ ప్రసారం అవుతాయని అన్నారు. అయితే ఈ వెబ్ సీరిస్ కాన్సెప్ట్ ఏంట‌నేది బ‌య‌ట‌కు వ‌చ్చి ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. ఎన్నో ఏళ్ల నుంచి ఓ మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాల‌ని క‌ల‌లు కంటూ ఉంటాడు రాజ్ త‌రుణ్‌. ఎట్ట‌కేల‌కు ఓ అమ్మాయితో పెళ్లి కుదురుతుంది. పెళ్లి పీట‌లు కూడా ఎక్కుతాడు.క‌రెక్టుగా తాళి క‌ట్టే టైంలో రాజ్ త‌రుణ్ క‌ల‌ల‌పై నీళ్లు జ‌ల్లి పెళ్లి కూతురు శివాని త‌న భాయ్ ఫ్రెండ్‌తో క‌లిసి లేచిపోతుంది. దీంతో రాజ్ త‌రుణ్ తీవ్ర మ‌నోవేద‌కు గురైపోతాడు. శివానితో పాటు ఆమె భాయ్ ఫ్రెండ్‌పై ప‌గ‌తో ర‌గిలిపోతాడు.. ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని అనుకుంటాడు. ఆ త‌ర్వాత రాజ్ త‌రుణ్ ఎలాంటి ? ప‌రిణామాలు ఎదుర్కొన్నాడు ? క‌థ‌లో ఏం జ‌రిగింది అన్న‌దే ఈ వెబ్ సీరిస్‌.

ప్రేమ‌లోని కొత్త కోణాన్ని ఈ వెబ్ సీరిస్ ఆవిష్క‌రించ‌బోతోంద‌ట‌. స‌రికొత్త ప్రేమ‌కు నిర్వ‌చ‌నంగా ఈ సీరిస్ ఉంటూ అంద‌రిని అల‌రిస్తుంద‌ని మేక‌ర్స్ ధీమాతో ఉన్నారు. కామెడీతో పాటు రొమాన్స్ డ్రామాతో ఈ వెబ్ సీరిస్ ఉంటుందని, రాజ్ త‌రుణ్- శివానీ మ‌ధ్య అదిరిపోయే సీన్లు ఉంటాయ‌ని తెలుస్తోంది. మ‌రి ఈ వెబ్ సీరిస్‌తో ఓటీటీలో అయినా రాజ్ త‌రుణ్ క్లిక్ అవుతాడేమో ? చూడాలి.ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే సరికొత్త ప్రేమ కథ అని.. అందరినీ అలరించేలా ఈ సిరీస్ ఉంటుందని అంటున్నారు. మరి కామెడీ డ్రామా రొమాన్స్ తో సాగే ‘అహ నా పెళ్ళంట’ వెబ్ సిరీస్ ప్రేక్షకులు ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

- Advertisement -