- Advertisement -
దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో గోపాల్‌పూర్‌కి సమీపంలో తీరం దాటింది అల్పపీడనం. దక్షిణ అంతర్గత ఒడిశా ప్రాంతంలో తిట్లాగర్‌కు ఆగ్నేయంగా 90 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది వాయుగుండం.
వాయుగుండం పశ్చిమ, వాయువ్య దిశలో కదిలి క్రమేపీ బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇవాళ జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలోని నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేడు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read:KTR:చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలి
- Advertisement -

