తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..

321
rain-pic
- Advertisement -

తెలుగు రాష్ట్రాలను మరో మూడు రోజులు వర్షాలు కుమ్మేయనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండనుందని,దీంతో వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇప్పటికే నైరుతి రాకతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (ఈదురు గాలులు గంటకు30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో) కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. బుధవారం సాధారణ వర్షపాతం 7 మీ.మీ నుంచి 13 మీ.మీ వర్షపాతం నమోదుకాగా అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలో నమోదైంది. ఆదిలాబాద్‌, కుమరంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో భారీగానే వర్షపాతం నమోదైంది.

- Advertisement -