ఐపీఎల్ 13లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్ధాన్ రాయల్స్ సంచలన విజయం సాధించింది. రాజస్ధాన్ ఆటగాళ్లు తేవటియా,స్మిత్,సంజు సామ్సన్ ఆటముందు భారీ లక్ష్యం చిన్నబోయింది. రాజస్దాన్ గెలవడం కష్టం అనుకుంటే మరో 3 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది.
ఓపెనర్ స్టీవ్ స్మిత్ (27 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు),మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సంజూ సామ్సన్ (42 బంతుల్లో 85; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) గెలుపుదారిన మళ్లించాడు.చివర్లో రాహుల్ తేవటియా (31 బంతుల్లో 53; 7 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో జట్టను గెలిపించాడు. 18 బంతుల్లో 51 పరుగులు చేయాల్సి ఉండగా కాట్రెల్ బౌలింగ్లో 6, 6, 6, 6, 0, 6తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 223 పరుగుల భారీస్కోరు చేసింది. మయాంక్ అగర్వాల్ (50 బంతుల్లో 106; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు సెంచరీ బాదగా, కెప్టెన్ రాహుల్ (54 బంతుల్లో 69; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేశాడు.