బిగ్ బాస్ 4…దేవి నాగవల్లి ఔట్

299
devi nagavalli

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 4 తెలుగు విజయవంతంగా 22 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. మూడోవారంలో యాంకర్ దేవి నాగవల్లి బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయింది. ఏడుగురిలో శనివారం ఇద్దరు లాస్య, మొనాల్‌లు సేవ్ కాగా మిగిలిన ఐదుగురికి ఐదు తాళాలు ఇచ్చి ఆ తాళంలో బాక్స్‌లు ఓపెన్ చేయాలని కోరారు నాగార్జున.

అయితే మొదటగా దేవి నాగవల్లి తాళానికి పెట్టె ఓపెన్ కావడంతో ఆమె సేవ్ అయినట్టు అనుకున్నారంతా.. అయితే తాళం ఓపెన్ అయితే సేవ్ అయినట్టు కాదని.. ఆ తాళానికి ఓపెన్ అయిన పెట్టిలో సేవ్ అయిన వాళ్ల పేరు ఉంటుందని ఆపేరు చదవాలని కోరారు నాగార్జున. దీంతో దేవి ఓపెన్ చేసిన పెట్టెలో మెహబూబ్ పేరు ఉండటంతో అతను సేవ్ అయ్యాడు.

ఒంటి కాళ్లతో డాన్స్.. తాగిన వాళ్లలా డాన్స్‌లు, నాగిని డాన్స్‌లు వేస్తూ రచ్చ చేసి తెగ నవ్వించారు. అయితే హారిక ప్రీజ్‌లో ఉంచి ఆమెను డిస్ట్రబ్ చేసే మగాడే లేడా? అని అభిజిత్‌ని రెచ్చగొట్టారు నాగ్. అభిజిత్ వచ్చి ఆమెను గట్టిగా వాటేసుకున్నాడు. అనంతరం నామినేషన్స్‌లో ఉన్న హారికను సేవ్ అయినట్టు ప్రకటించారు నాగార్జున.

తర్వాత అరియానా గ్లోరి సేవ్ అయినట్టు ప్రకటించగా చివరిగా కుమార్ సాయి-దేవిలు మాత్రమే మిగిలారు. ఇద్దరికి రెండు బాక్స్‌లు ఇచ్చి ఆ బాక్స్‌లో చేయిపెట్టాలని చేతికి ఎరుపు రంగు అంటుకుంటే వాళ్లు ఎలిమినేట్ అయినట్టు అని.. గ్రీన్ రంగు అంటుకుంటే వాళ్లే సేవ్ అయినట్టు అని తెలపండంతో కుమార్ సాయి చేతికి ఎరుపు రంగు అంటుకోవడంతో ఎలిమినేట్ అయ్యింది దేవి.

దేవి ఎలిమినేట్ కావడంతో అరియానా ఏడ్చేయగా ఇంటి సభ్యులంతా షాక్‌లోకి వెళ్లిపోయారు. రాజ శేఖర్ మాస్టర్ సైతం దేవిని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. గంగవ్వ కాళ్లు మొక్కి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది యాంకర్ దేవి.తర్వాత ఒక్కో ఇంటి సభ్యుడి గురించి చాలా పాజిటివ్‌గా చెప్పి ఇంటి సభ్యులందర్నీ భావోద్వేగానికి గురిచేసింది దేవి.

అంతకముందు సండే అంటే ఫన్ అంటూ ఎంటర్ టైన్ చేయాలని ఇంటి సభ్యులను కోరారు నాగ్. మొదట అభిజిత్, రాజశేఖర్ మాస్టర్‌లతో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడించారు. ఇందులో రాజశేఖర్ మాస్టర్ 50 బెలూన్లను ఒక్క నిమిషంలో బ్లాస్ట్ చేశారు. ఆ తర్వాత దేవి, లాస్య‌లు టవర్ గేమ్ ఆడారు. ఇందులో ఎవరూ టవర్‌ని బ్యాలెన్స్ చేయలేకపోవడంతో ఇద్దరూ కలిపి టవర్‌ని పెట్టే ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. కుమార్, సొహైల్‌లు స్ట్రాల్ ఆట ఆడించారు. స్ట్రాలు ఎక్కువ ఎవరు పెట్టుకుంటే వాళ్లే విజేత అని ప్రకటించగా.. ఈ స్ట్రా గేమ్‌లో కుమార్ సాయి విన్నర్ అయ్యాడు.

సాక్స్ గేమ్‌లో హారికపై సాక్షి దీక్షిత్ గెలవగా అఖిల్-మొహబూబ్‌లు మధ్య స్కిప్పింగ్ గేమ్ పెట్టగా.. మొహబూబ్ 100 స్కిప్ట్స్ చేయగా.. అందులో సగం కూడా చేయలేకపోయాడు అఖిల్.