పెళ్లి పీటలెక్కనున్న రాహుల్ తెవాటియా..!

208
rahul-tewatia-gets-engaged
- Advertisement -

రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రాహుల్ తెవాటియా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. బుధ‌వారం ఇరు కుటుంబసభ్యుల మధ్య ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరుగగా ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు రాహుల్. పలువురు ఆటగాళ్లు రాహుల్‌కు విషెస్ తెలపగా వచ్చే నెలలో పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.

rahul tewatiya

సినిమా సెల‌బ్రిటీలే కాదు ఇండియ‌న్ క్రికెట‌ర్స్ కూడా వ‌రుస‌గా పెళ్లి పీట‌లెక్కుతున్నారు. ఈ ఏడాది ఆల్‌రౌండ‌ర్ విజ‌య్ శంక‌ర్ వివాహం చేసుకోగా, రీసెంట్‌గా టీమ్‌ఇండియా పేసర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ వివాహం ఫిబ్రవరి 2న జరిగింది.

ఐపీఎల్ సీజన్‌ 13లో స్టార్‌గా నిలిచాడు రాహుల్ తెవాటియా. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్ బౌలర్‌ కాట్రెల్‌ ఓవర్‌లో ఒకే ఓవర్‌లో 5 సిక్స్‌లు బాధి ఐపీఎల్ చరిత్రలోనే పంజాబ్‌కు రికార్డు విజయాన్ని అందించాడు.

- Advertisement -