రాహుల్‌కు థ్యాంక్స్ చెప్పిన యువీ..ఎందుకో తెలుసా!

141
yuvi

రాహుల్ తెవాటియా…ఐపీఎల్‌లో ఇప్పుడు ఈ పేరు మార్మోగిపోతోంది. రాజస్ధాన్ రాయల్స్‌కు చెందిన ఈ స్టార్ ఆటగాడు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓవర్‌నైట్‌లో సంచలన స్టార్‌గా మారిపోయాడు. పంజాబ్ స్టార్ బౌలర్ కాట్రెల్‌ ఓవర్‌లో ఒకే ఓవర్‌లో 5 సిక్స్‌లు బాధి రాజస్ధాన్‌కు ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు విజయాన్ని అందించాడు.

ఈ నేపథ్యంలో రాహుల్‌కు థ్యాంక్స్‌ చెప్పాడు యువరాజ్‌ సింగ్. మిస్టర్‌ రాహుల్‌ తెవాటియా ఆ ఒక్క బంతిని వదిలేసినందుకు థ్యాంక్స్‌. అద్భుతమైన మ్యాచ్‌. గొప్ప విజయం సాధించినందుకు రాయల్స్‌కు అభినందనలు. శాంసన్‌, మయాంక్‌ కూడా అద్భుతంగా ఆడారు అంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు.