గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న రాహుల్ సిప్లిగంజ్..

46
rahul sipligunz

ఎం.పి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు ప్రముఖ సింగర్ బిగ్ బాస్ 3 సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్. ఎం.పి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో సంతోషంగా ఉందని రాహుల్ సిప్లిగంజ్ తెలిపారు.ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు.

మ్యూజిక్ డైరెక్టర్ జీవన్ బాబు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ బంజారాహిల్స్ లోని తన నివాసంలో మొక్కలు నాటిండు.అనంతరం మరో ముగ్గురు ( ఇద్దరు సింగర్స్ మనీషా , సత్య యామిని , అలీ రేజా ) లు కూడా మూడు మొక్కలు నాటి వారు మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసరాలని రాహుల్ సిప్లిగంజ్ అన్నారు.