పృథ్వీరాజ్ కు తీవ్ర అనారోగ్యం…

473
prudvi
- Advertisement -

30 ఇయర్స్‌ పృథ్వీరాజ్ తీవ్ర అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరారు.ఆరోగ్య పరిస్ధితి బాగాలేకపోవడంతో ఆస్పత్రిలో చేరానని మీ ఆశీస్సులు కావాలంటూ వీడియో ని షేర్ చేశారు.గత కొన్నిరోజులుగా తీవ్ర జ్వరం తో పృథ్వీరాజ్ బాధపడుతుండగా కరోనా టెస్టుల్లో నెగెటివ్ వచ్చిందని … స్కానింగ్ తర్వాత వైద్యుల సలహాతో ఆసుపత్రిలో చేరానిన తెలిపారు.

గత కొన్నిరోజులుగా తాను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నానని, పలుచోట్ల వైద్య పరీక్షలు చేయిచేస్తే కరోనా నెగెటివ్ వచ్చిందని వెల్లడించారు. సీటీ స్కానింగ్ కూడా తీయించానని, అయితే డాక్టర్ల సూచన మేరకు క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకుని, నిన్న అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరానని తెలిపారు. అభిమానుల ఆశీర్వాదాలతో పాటు వెంకటేశ్వరస్వామి దీవెనలు తనకుండాలని కోరుకుంటున్నానని, త్వరలోనే ఆరోగ్యవంతుడ్ని కావాలని కోరుకుంటున్నానని పృథ్వీ వీడియోలో తెలిపారు.

- Advertisement -