మొక్కలు నాటిన ఎమ్మెల్యే సైదిరెడ్డి..

56
mla saidireddy

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. తన ఇంటి గార్డెన్ లో మొక్క నాటారు .

ఎంపీ సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇప్పుడు దేశమంతా వ్యాపించింది , తెలంగాణ హరిత హారానికి ఒక దిక్సూచి అయిందని , సెలబ్రిటీలు , కార్పొరేట్ దిగ్గజాలు , రాజకీయ నాయకులు , ఇలా ప్రతి ఒక్కరు భాగస్వామ్య కావడానికి సంతోష్ గారి కృషి అభినందనీయం అన్నారు.

తన నియోజకవర్గం లో ప్రతి ఒక్కరి చేత మూడు మూడు మొక్కలు నాటే విదంగా కృషి చేస్తున్న అని తెలియజేశారు . ట్విట్టర్ వేదికగా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి నాకు గ్రీన్ ఛాలెంజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్న అని చెప్పారు .