అసలు రిలేషన్‌ ఇప్పుడై మొదలైంది..

519
rahul
- Advertisement -

బిగ్ బాస్ సీజన్‌ 3 విన్నర్‌గా రాహుల్ సిప్లిగంజ్- రన్నర్‌గా శ్రీముఖి నిలిచిన సంగతి తెలిసిందే. వాస్తవానికి వీరిద్దరు బిగ్ హౌస్‌లోకి ఎంటర్ కాకముందు మంచి స్నేహితులు. కానీ ఒక్కసారి హౌస్‌లోకి ఎంటర్‌కాగానే సీన్ రివర్సైంది. ఎంతలా అంటే ఇద్దరు పెరేంట్స్‌ జోక్యం చేసుకోవడమే కాదు చివరికి వీరిద్దరు మాట్లాడుకోలేని పరిస్ధితి నెలకొంది.

బిగ్ హౌస్‌ నుంచి బయటికొచ్చిన తర్వాత పలు ఇంటర్వ్యూలో రాహుల్..శ్రీముఖి ప్రస్తావన తెచ్చాడు. బిగ్ బాస్ విజేతగా నిలిచిన తర్వాత తాము ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదని చెప్పాడు. కానీ తాజాగా వీరిద్దరు తమ మైండ్ సెట్ మార్చుకున్నారు. మళ్లీ ఒక్కటయ్యారు.

శ్రీముఖితో రాహుల్ సెల్ఫీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు రిలేషన్ ఇప్పుడే మొదలైంది ..గతం గతః అంటూ  రాహుల్ ఇచ్చిన క్యాప్షన్‌తో అంతా ఫిదా అవుతున్నారు.

వీరిద్దరి సెల్ఫీ ఫోటో చూసిన నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద స్నేహితులు ఇద్దరు ఒక్కటయ్యారు అంటూ కామెంట్ చేస్తుండగా మరికొంతమంది పునర్నవే వీరిద్దరిని కలిపిందని ట్విట్లు చేస్తున్నారు.

rahul sipligunz – srimukhi photo goes viral on social media…rahul sipligunz – srimukhi photo goes viral on social media

- Advertisement -