రాజకీయాల్లోకి రాను:రాహుల్ సిప్లిగంజ్

96
- Advertisement -

తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదన్నారు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న రూమర్స్‌పై స్పందించిన రాహుల్…తాను గోషామహల్ ఎమ్మెల్యేగా పోటీచేస్తానని వస్తున్న వార్తలన్నీ అబద్దమేనన్నారు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా స్పందించిన రాహుల్..నా మీద చాలా రూమర్స్ వస్తున్నాయి, అన్ని పార్టీలకి చెందిన మన లీడర్స్ అందరిని నేను గౌరవిస్తాను. నేను ఒక మ్యుజిషియన్, ఆర్టిస్ట్ మాత్రమే. నా జీవితం అంతా కూడా నేను ఇదే. నా ఫీల్డ్ లో నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ప్రస్తుతానికి నా కెరీర్ పైనే నేను ఫోకస్ చేశాను. నాకు ఏ పార్టీ నుంచి ఎలాంటి ఆఫర్ రాలేదు. ఇలాంటి వార్తలు ఇకనైనా ఆపండి అని తెలిపారు.

Also Read:రాస్ బెర్రీస్..తింటే ఏమవుతుందో తెలుసా?

- Advertisement -