అవును. ఇప్పుడు రాహుల్‌గాంధీ గిన్నిస్ బుక్ లోకి ఎక్కన్నున్నాడు. గిన్నిస్ బుక్ లోకి ఎక్కాలంటే..ఏదో ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యాలి. లేదా ఇంతవరకూ ఎవరూ చేయని పనిని చేసి చూపిస్తే.. దానికి గిన్నిస్ ఫిదా అయిపోయి ఓ ఛాన్స్ ఇచ్చేస్తుంది. మరి రాహుల్ అసలేం చేశాడు? ఎందుకు రాహుల్ పై గిన్నిస్ బుక్ కన్నేసింది? అనే విషయం మాత్రం అందర్లోనూ ఆసక్తిరేపుతోంది.
అయితే నిజానికి గిన్నిస్… రాహుల్ ని వెతుక్కుంటూ రాలేదట. మరి రాహులే వెళ్ళాడా ? అంటే…అదీ కాదు. ఇదంతా రాహుల్ పరిస్థితి చూడలేక మధ్యప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు చేసిన ప్రయత్నం.
ఎందుకంటే..కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఇంతవరకూ విపక్ష పార్టీల నేతలు టార్గెట్ చేశాయి. కానీ ఇప్పుడు సాధారణ జనం కూడా వెంటాడుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి రాహుల్ నే బాధ్యుడిని చేస్తూ నెటీజనులు సెటైర్లు.. కార్టూన్లు సంధిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే తాజా మధ్యప్రదేశ్ కు చెందిన విశాల్ దివాన్ అనే ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఏకంగా రాహుల్ ని ఓటముల వీరుడిగా గిన్నీస్ బుక్ లోకి ఎక్కించాలని కోరుతూ దరఖాస్తు చేశాడట. అందుకు అవసరమైన రుసుమునుకూడా చెల్లించాడట. ఇంతకీ ఆ కుర్రాడు రాహుల్ కి గిన్నీస్ అర్హతలుగా పేర్కొన్నదేంటంటే..
దాదాపుగా ఈ ఐదేళ్ల కాలంలో రాహుల్ గాంధీ దేశంలో జరిగిన 27 ఎన్నికల్లో ప్రచారం చేశారని అన్నింటా ఆయన పరాజయాన్నే చవిచూశారని చెప్పాడు. ఇన్ని పరాభవాల్ని ఎదుర్కొన్న రాజకీయనేత భారతదేశంలో మరొకరు లేరని, కావునా రాహుల్ ని గిన్నీస్ బుక్ లోకి ఎక్కించాలని అభ్యర్థించాడట.
ఇక అమెరికా కేంద్రంగా పనిచేసే గిన్నీస్ రికార్డ్స్ సంస్థ విశాల్ పెట్టుకున్న దరఖాస్తును పరిశీలనకు స్వీకరించింది. మరి రిజల్ట్ ఏంటన్నది త్వరలోనే తెలుస్తుంది. మరి రాహుల్ గాంధీ రాబోయే కాలంలోనైనా ఇలాంటి పరిస్థితుల్లోంచి బయటపడతాడా.?లేక కార్టూన్ క్యారెక్టర్ గా మిగిలి పోతాడా? చూడాలి.