- Advertisement -
ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. దళిత, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ హాస్టళ్లలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని లేఖలో పేర్కొన్నారు రాహుల్.
బడుగు బలహీన వర్గాలకు చెందిన 90 శాతం మంది విద్యార్థుల విద్యపై సమస్యలను పరిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల బీహార్-దర్భంగాలోని అంబేద్కర్ హాస్టల్‌ను తాను సందర్శించినప్పటి పరిస్థితులపై లేఖలో ప్రస్తావించారు.
అట్టడుగు వర్గాల యువత అభివృద్ధి చెందకపోతే.. దేశం అభివృద్ధి చెందదని తాను భావిస్తానని లేఖలో పేర్కొన్నారు రాహుల్ గాంధీ.
Also Read:ఫ్రాడ్ కంపెనీలతో పెట్టుబడులా?
- Advertisement -

