మరొకసారి ఫ్రాడ్ కంపెనీలతో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పెట్టుబడులను ప్రకటించిందని మండిపడ్డారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్. గతంలో వాల్ష్ కర్రా, స్వచ్ బయో, ఉర్సా లాంటి బోగస్ కంపెనీలతో పెట్టుబడులను ప్రకటించి అడ్డంగా దొరికిపోయిందని గుర్తుచేశారు.
మరొకసారి మనకిన్ బయో, యంత్రా టెక్ కంట్రోల్స్ అనే రెండు ఫ్రాడ్ కంపెనీలతో పెట్టుబడులు తెచ్చామని తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. 16 మార్చి 2025 న మనకిన్ బయో అనే బోగస్ వెబ్ సైట్ సృష్టించి, అసలు రిజిస్టర్ అవ్వని కంపెనీతో రూ.340 కోట్ల పెట్టుబడులు, 800 కొత్త ఉద్యోగాలు వస్తాయని ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపించారు.
యంత్రా టెక్ కంట్రోల్స్ అనే మరొక కంపెనీ రూ.255 కోట్లు పెట్టుబడులు పెడుతుందని ప్రకటించారు. గత వార్షిక సంవత్సరంలో 2 లక్షల 34 వేల నష్టాల్లో ఉన్న యంత్రా టెక్ కంట్రోల్స్ రూ.255 కోట్ల పెట్టుబడులు ఎలా పెడుతుంది ?, ఇప్పటికైనా ఫ్రాడ్ కంపెనీల పేరుతో బోగస్ పెట్టుబడులు చూపించి తెలంగాణ ప్రజలను మోసం చేయడం ఆపేయండి అని డిమాండ్ చేశారు.
Also Read:‘ఉస్తాద్ భగత్ సింగ్’.. షూట్‌లో పవన్
🚨 CONGRESS GOVT SCAM ALERT
Today, Congress Government has once again announced fraud investments to fool people of Telangana.
➡️Manakin Bio is not even registered with Ministry of Corporate Affairs,
a fraud website without any specific details was created on 16th March 2025 ,… pic.twitter.com/LG0umaVOls— Dr.Krishank (@Krishank_BRS) June 10, 2025

