అణగారిన వర్గాల ఆశాజ్యోతి..ఫూలే!

9
- Advertisement -

మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన గొప్ప సంస్కర్తగా ఫూలేను కొనియాడారు.

రాహుల్ గాంధీ తన సందేశంలో మాట్లాడుతూ, మహాత్మా ఫూలే అణగారిన వర్గాల హక్కులను రక్షించేందుకు తన మొత్తం జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. సమాజంలో ఉన్న వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం దేశానికి సమానత్వం మరియు న్యాయం దిశగా మార్గదర్శకంగా నిలిచిందని తెలిపారు.

మహానీయ సంస్కర్త జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా వారికి నా వినమ్ర నివాళులు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన కృషి అపూర్వం. వివక్షకు వ్యతిరేకంగా ఆయన పోరాటం దేశానికి సమానత్వం దారి చూపింది అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.అంతేకాకుండా, ఫూలే ఆలోచనలు, సిద్ధాంతాలు ఎప్పటికీ సమాజాన్ని ముందుకు నడిపిస్తాయని, సామాజిక న్యాయం సాధనలో అవి శాశ్వత ప్రేరణగా నిలుస్తాయని ఆయన అన్నారు. ప్రజలు ఆయన మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు కూడా మహాత్మా ఫూలేకు నివాళులు అర్పించారు. పార్లమెంట్ ప్రాంగణంలో ఉన్న ప్రేరణ స్థల్ వద్ద పుష్పాంజలి కార్యక్రమం నిర్వహించగా, పలువురు నేతలు పాల్గొన్నారు.మహాత్మా జ్యోతిరావు ఫూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలో జన్మించారు. కులవ్యవస్థ నిర్మూలన, మహిళల విద్యాభివృద్ధి, అణగారిన వర్గాల సాధికారత కోసం ఆయన చేసిన సేవలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి.

Also Read:బాధితుల ఫోటోలతో పాక్‌కు ఇరాన్ ప్రతినిధులు

- Advertisement -