రాయ్‌బరేలీ బరిలో రాహుల్..

22
- Advertisement -

ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. రాయ్ బరేలీ నియోజకవర్గం నుండి రాహుల్ గాంధీ, అమేథీ నుండి కిషోరి లాల్ శర్మ పేర్లను ఖరారు చేసింది. ఇవాళ నామినేషన్లకు చివరి రోజు కావడంతో వీరిద్దరూ నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

రాయ్ బరేలీలో రాహుల్ పై బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ పోటీ చేయనుండగా గత ఎన్నికల్లో రాహుల్ వాయనాడ్, అమేథీ నియోజకవర్గాల నుంచి పోటీచేయగా అమేథిలో ఓటమి పాలయ్యారు.

అమేథీ నుంచి మరోసారి బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. ఆమెపై కాంగ్రెస్ అభ్యర్థిగా కిషోరి లాల్ శర్మ పోటీచేయబోతున్నారు. వాస్తవానికి రాయ్ బరేలీ స్థానాన్ని ప్రియాంక గాంధీకి ఇస్తారని ప్రచారం జరిగిన ఆమె విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Also Read:‘బకాసనం’ వేస్తే ఏమౌతుందో తెలుసా?

- Advertisement -