నేను ఎవరికీ భయపడను- రాహుల్ గాంధీ

56
rahul

గాంధీ జయంతి సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానని కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. తాను ఈ ప్రపంచంలో ఎవరికీ భయపడనని.. ఏ విధమైన అన్యాయానికీ తాను తలవంచనని ఆయన చెప్పారు. అసత్యాలను సత్యానికి ఉన్న శక్తితో జయిస్తానని పేర్కొన్నారు. అసత్యంతో పోరాడే సమయంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులను తాను ఎదుర్కొంటానని తెలిపారు.

కాగా, హత్రాస్‌ హత్యాచార ఘటన నేపథ్యంలో నిన్న బాధిత కుటుంబాన్ని కలవడానికి వెళుతుండగా రాహుల్ గాంధీని అడ్డగించిన పోలీసులు ఆయనతో పాటు సోదరి ప్రియాంకను నిర్బంధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో లాల్చీ పట్టుకుని యూపీ పోలీసులు లాగేయడంతో రాహుల్ కిందపడ్డారు. ఆయన భుజానికి స్వల్పగాయమైంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు.