కొత్త రెవెన్యూ చట్టంతో ఇంటి నిర్మాణం సులభతరం: మంత్రి కేటీఆర్

184
ktr

కరోనా క్లిష్ట సమయంలో కోటి రూపాయల సొంత నిధులతో కరోనా వార్డ్లలను ఏర్పాటు చేసి సేవ చేసిన భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి కి ప్రత్యేక అభినందలు తెలిపారు మంత్రి కేటీఆర్. యాదాద్రి జిల్లా…..భువనగిరి లోని గాంధీ పార్క్ లో గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని, మున్సిపాలిటీ లో
100 కోట్లతో పలు కార్యక్రమాలు కు శంకుస్థాపన లు, ప్రారంభోత్సవాలు చేశారు.భువనగిరి మున్సిపాలిటీ లో అధునాతనముగా నిర్మించిన కంపోస్ట్ యార్డ్ లో
డీఆర్సీ సెంటర్, రీ సైక్లింగ్ సెంటర్,వర్మీ కంపోస్ట్ యూనిట్,ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.

అనంతరం మాట్లాడిన మంత్రి కేటీఆర్….సీఎం కేసీఆర్ నాయకత్వం లో ఎన్నో అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలు లను విజయవంతం గా అమలు సుకుంటున్నాం……43 శాతం ప్రజలు పట్టణాల్లో నివసిస్తున్నారని తెలిపారు.పట్టణాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్నందు వల్లే ప్రజలు పట్టణాల్లో నివాసం ఉంటున్నారు……కొత్త మున్సిపల్ చట్టం ద్వారా పౌరుడు కేంద్రంగా పాలన సాగిస్తున్నాం అన్నారు. కొత్త మున్సిపల్ చట్టం ద్వారా ఇంటి నిర్మాణం సులభతరం చేసాం….మున్సిపాలిటీ లాల్లో 10 శాతం బడ్జెట్ ను పచ్చదనం కి కేటాయిస్తునం….అధికారులులను, ప్రజా ప్రతినిధులు లను భాద్యులుగా చేశామన్నారు.

తెలంగాణలో 142 మున్సిపాలిటీ 1326 నర్సరీలను ఏర్పాటు చేసాం….ఈ రోజు 16,338 టాయిలెట్స్ లను మున్సిపాలిటీ లాల్లో ఏర్పాటు చేసాం..ఇది రికార్డ్ ……..142 మున్సిపాలిటీ లలో 198 డ్రై రిసోర్స్ సెంటర్ లను నెలకొలిపినం……..డంపింగ్ యార్డ్ లను కూడా రిసోర్స్ పార్క్ లల్లాగా పచ్చదనం పరిడవెళ్లేలాగా తీర్చిదిద్దామని చెప్పారు. అన్ని మున్సిపాలిటీ లలో బయో మైనింగ్ ద్వారా చెత్తను శుద్ధి చేసాం ..దుర్వాసన రాకుండా చర్యలు తీసుకుంటున్నాం…..కొన్ని రోజుల్లో అన్ని మున్సిపాలిటీ లలో మానవ వ్యర్ధాల శుద్దికారణ ప్లాంట్ (FSTP ) లను నిర్మిస్తున్నాం…..పట్టణ ప్రగతి పురస్కారాలను 5 కేటగిరీలో ప్రారంభిస్తున్నాం అన్నారు.

మెరుగైన సేవలు చేసే వారికి అవార్డు లను ఇస్తాం…. పిబ్రవరి 24 నాడు పట్టణ ప్రగతి దినోత్సవం రోజున అందజేస్తాం..పట్టణ ప్రగతి కార్యక్రమంలో రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీ లకు నెల నెలా ఇప్పటి వరకు 1,100 కోట్లను మంజూరు చేసినం అన్నారు. హెచ్‌ఏండీఏ నుంచి 25 కోట్లు తో భువనగిరి లో రోడ్డు లను సుందరికరణ పనులను చేస్తున్నాం….త్వరలోనే MMTS రైళ్లు యాదాద్రి జిల్లా కు వస్తాయి….యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రపంచ ప్రసిద్ధ ఆలయంగా ముస్తాబు అవుతుందన్నారు.

రోజు వేలాది మంది భక్తులు, పర్యాటకులు యాదాద్రి కి వస్తారు…మున్సిపల్ సిబ్బందిని అన్ని విధాలా ఆదుకుంటున్నాం..కాపాడుకుంటున్నాం….రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీ లను ఒడిఫ్ ++ ల్లాగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి,గొంగిడి సునీత,గాదరి కిషోర్,చిరుమర్తి లింగయ్య,సైదిరెడ్డి,ఎమ్మెల్సీ కృష్ణానెడ్డి,డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర రెడ్డి,కలెక్టర్ అనిత రాంచంద్రన్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.