కేసీఆర్,కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం..

275
kcr

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో జీవో నంబర్ 58,59 పట్టాలు, నోటరీ ఇళ్ల స్థలాలను ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయనున్న సందర్భంగా వెంకటేశ్వర కాలనీ డివిజన్ పరిధిలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు స్థానిక కార్పొరేటర్ మన్నే కవిత రెడ్డి,స్థానికి ప్రజలు తదితరులు హాజరైయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ గాంధీ జయంతిని పురస్కరించుకుని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ చట్టంలో ఎన్నో సంస్కరణలు చేశారు. ఈ కొత్త రెవెన్యూ చట్టాన్ని మా నియోజకవర్గ ప్రజల్లోకి తీసుకువెళుతున్నామన్నారు.ధరణి పోర్టల్ దసరాకు ప్రారంభం కానున్న నేపథ్యంలో తమకున్న భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వివరించడం జరుగుతుంది. 75 గజాలు ఉన్న వారు ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా ఇల్లు కట్టుకునేల మంత్రి కేటీఆర్ అవకాశం కల్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని దానం అన్నారు.

ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల ఉనికి కనుమరుగవుతుంది. ఇప్పటికే అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తున్నామని దానం తెలిపారు. పేదల కోసం లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తున్నాం. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లతో పాటు నోటరీ,పట్టాలు ఉన్నవారికి రిజిస్ట్రేషన్ చేరుకునేలా అవకాశం కల్పించాం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్యక్రమ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు స్థానిక ప్రజలతో కలిసి ఎమ్మెల్యే దానం నాగేందర్ పాలాభిషేకం చేశారు.