- Advertisement -
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ప్రజలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేముందు కూడా పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితికి నెలకొందని, ఈ పరిస్థితికి కారణం ప్రధాన మంత్రేనని మండిపడ్డారు.
ఇవాళ ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘మెహంగాయ్ పర్ హల్లా బోల్’ ర్యాలీ జరగనుంది. ఈ ర్యాలీకి భారీగా కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. ఇవాళ మధ్యాహ్నం జరిగే సభలో పాల్గొని ప్రసంగించనున్నారు రాహుల్.
సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ ప్రారంభించనున్న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3,500కి.మీ మేర సాగే కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
- Advertisement -