వ్యాక్సిన్‌ ఒక్కటే శాశ్వత పరిష్కారం: రాహుల్

23
rahul

కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే శాశ్వత పరిష్కారం అన్నారు ఎంపీ రాహుల్ గాంధీ. కరోనా కట్టడిలో ప్రధాని మోదీ విఫలమయ్యారని ఆరోపించిన రాహుల్…
కోవిడ్ 19 ను మోడీ సరిగా అర్థం చేసుకోలేకపోయారన్నారు.

భారత్ లో మరణాల రేటు అబద్ధమ‌ని..ప్రభుత్వం వీటిపై ప్రజలకు నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. లాక్ డౌన్ తో ఏం లాభం లేద‌న్న రాహుల్‌…. మాస్క్ లు ధరించడం, లాక్ డౌన్ తాత్కాలిక పరిష్కారమే అన్నారు. కరోనాపై మేం పదే పదే ప్రభుత్వాన్ని హెచ్చరించామ‌ని.. కానీ ఎన్డీఏ సర్కార్ కళ్లు తెరవలేదన్నారు.