మిక్సింగ్ టీకాలపై పరిశోధనలు

39
covid

రెండు వేర్వేరు వ్యాక్సిన్‌‌లను కలిపి తీసుకోవచ్చా….ఒకవేళ పొరపాటును తీసుకుంటే ఏమవుతుంది…ఇప్పుడు ఇదే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది. యూపీలో ఓ గ్రామంలో కొందరికి తొలి డోస్‌గా కొవిషీల్డ్‌…రెండో డోస్‌గా కోవాగ్జిన్ ఇచ్చారు. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

అయితే రెండు వేర్వురు టీకాలు తీసుకుంటే0 భయపడాల్సిందేమీ లేదని నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కొవిడ్-19లో మెంబర్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. రెండు వ్యాక్సిన్‌‌లు కలిపి తీసుకున్నా వచ్చే ప్రమాదమేమీ లేదన్నారు.

ఇక దీనిపై యూకేలో విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఆక్స్‌‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకా, ఫైజర్, కొవిషీల్డ్ వ్యాక్సిన్‌‌లను కలిపి ఇవ్వడంపై పరిశోధనలు జరుగుతున్నట్లు లాన్సెట్ జర్నల్ తెలిపింది. ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న వారిలో 34 శాతం మందికి.. ఫైజర్,కొవిషీల్డ్ తీసుకున్న వారిలో 41 శాతం మందికి జ్వరం వచ్చిందని లాన్సెట్ రిపోర్టులో వెల్లడించింది. ఇంకా చాలా పరిశోధనలు జరగాలని అప్పటివరకు వేర్వేరు వ్యాక్సిన్‌‌లను కలిపి తీసుకోవద్దని హెచ్చరిస్తున్నాయి.