7వ రోజుకు చేరిన ఎంపీ సంతోష్ అన్నదానం..

28

7వ రోజు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో దేశానికి వెన్నెముక లాంటి రైతులు లాక్ డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రైతు కూలీలకు అండగా నిలవాలని రాజ్యసభ జోగినిపల్లి సంతోష్ కుమార్ నడుంబిగించారు. లాక్ డౌన్ పూర్తి అయ్యేంతవరకు కరీంనగర్ మార్కెట్ కార్యాలయం యందు రైతు కూలీలందరికీ అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

ఈరోజు కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు కార్పొరేటర్ కాశెట్టి శ్రీనివాస్ అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలుక అనిత ఆంజనేయులు,బోయినిపల్లి జెడ్పిటిసి కత్తెరపాక ఉమా కొండయ్య,టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొలిపాక మల్లికార్జున్,చాట్లపల్లి పురుషోత్తం, మార్కెట్ సిబ్బంది, రైతులు, హమాలి కూలీలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.ఇంత గొప్ప అన్నదాన కార్యక్రమన్ని మా మార్కెట్ ఆవరణలో నిర్వహింస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలుక అనిత ఆంజనేయులు.