దేశంలో బలమైన ప్రతిపక్షం:రాహుల్

13
- Advertisement -

దేశంలో బలమైన ప్రతిపక్షం ఉందని చెప్పారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రాహుల్..నోట్ల ర‌ద్దుతో ఎలా ఆర్థిక వ్య‌వ‌స్థను నాశ‌నం చేశారో, ఇప్పుడు విద్యా వ్య‌వ‌స్థ‌కు అదే జ‌రుగుతోంద‌న్నారు. త‌ప్పు చేసిన వారిని శిక్షించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

ఇక ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఛాతి 56 ఇంచులు ఉండేదని కానీ ఇప్పుడు అది 32 ఇంచులకు చేరుకుందని ఎద్దేవా చేశారు. మోడీ అంటే ఎన్నికలకు ముందు భయం ఉండేదని కానీ ఇప్పుడు ఆ భయం పోయిందన్నారు.

మాన‌సికంగా మోడీ బలహీనపడ్డారని… వార‌ణాసిలో ఒక‌రు ఆయ‌న‌పై చెప్పులు విసిరేశార‌ని గుర్తు చేశారు. మోడీ అనే కాన్సెప్ట్‌ను విపక్షాలు ధ్వంసం చేశాయని…దేశ రాజకీయాల్లో ఇది కీలక పరిణామం అన్నారు.

Also Read:కల్కి..అఫీషియల్ రన్ టైం!

- Advertisement -