ఎన్డీయే అంటే “నో డేటా అవలైబుల్‌” : రాహుల్‌ గాంధీ సెటైర్లు

88
rahul
- Advertisement -

వివిధ సందర్భాల్లో తమ వద్ద తగిన డేటా లేదంటూ కేంద్రం సమాధానం ఇవ్వడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ సెటైర్‌ వేశారు. ఈ ప్రభుత్వం వద్ద డేటానే కాదు జవాబు దారీతనం కూడా లేదని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఎన్డీయే అనే పదానికి తనదైన నిర్వచనం ఇచ్చారు. ఎన్డీయే అంటే నో డేటా అవలైబుల్‌ అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ట్వీట్ చేశారు.

ఆక్సిజన్‌ కొరత కారణంగా చనిపోవడం గానీ, వ్యవసాయం చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో ఎవరూ చనిపోవడం గానీ జరగడం లేదన్న విషయం ప్రజలు నమ్మాలని ఈ ప్రభుత్వం కోరుకుంటోందని రాహుల్‌గాంధీ అన్నారు. మూకదాడులు జర్నలిస్టుల అరెస్టుల వంటి వాటిపైనా ప్రభుత్వం మౌనంగా ఉండడాన్ని తప్పుబట్టారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో నడకదారిన వెళ్లిన చాలామంది మరణించారు. దీనిపై కేంద్రం అప్పట్లో తమ వద్ద అలాంటి డేటా ఏదీ లేదని పేర్కొంది. ఇలా పలు సందర్భాల్లో కేంద్రం తమ వద్ద డేటా లేదని సమాధానం ఇవ్వడంపై రాహుల్‌ ఈ విధంగా స్పందించారు.

- Advertisement -