సినీ పరిశ్రమ దిగ్గజం కృష్ణ: రాహుల్

294
rahul
- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల సంతాపం తెలిపారు ఎంపీ రాహుల్ గాంధీ. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన రాహుల్…సినీ వృత్తి పట్ల ఆయనకు అసమానమైన గౌరవం… క్రమశిక్షణ ఉండేదని కొనియాడారు. ఆయన మరణం సినీ లోకానికి తీరని లోటు అని తెలిపిన రాహుల్..ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇందిరా గాంధీ మరణించిన సమయంలో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన కృష్ణ.. అక్కడే రాజీవ్ గాంధీని తొలిసారి కలిశారు. ఆ సమయంలో ఏపీలో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని అడ్డుకోవాలంటే కాంగ్రెస్ కు సినీ గ్లామర్ అవసరమని భావించిన రాజీవ్ గాంధీ.. కృష్ణను పార్టీలోకి ఆహ్వానించారు. 1984లో కాంగ్రెస్లో చేరిన కృష్ణ.. 1989లో కాంగ్రెస్ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -