ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న చోట కూడా బీజేపీకే అనుకూలంగా ఫలితాలు వచ్చాయి అని ఆరోపించారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ కు పూర్తి భిన్నంగా ఫలితాలు వస్తున్నాయి అన్నారు.
ఇటీవల జరిగిన రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై అధ్యయనం చేశాం అని… హర్యానా, మధ్యప్రదేశ్లోనూ అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి అన్నారు. బీహార్లో లక్షల మంది ఓట్లను తొలగించారు… బీహార్లో ఓట్ల తొలగింపుపై ఈసీ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు రాహుల్.
మహారాష్ట్ర ఎన్నికలపై అనేక అనుమానాలు ఉన్నాయి… అక్కడ 5 ఏళ్లలో పెరిగిన ఓటర్ల సంఖ్య కంటే 5 నెలల్లో పెరిగిన ఓటర్ల సంఖ్య ఎక్కువ అన్నారు. ఇది మాకు అనేక అనుమానాలు కలిగించింది… పోలింగ్ రోజు సాయంత్రం 5 తర్వాత గణనీయంగా ఓటింగ్ శాతం పెరిగింది అన్నారు.
Also Read:నిరుద్యోగ హామీలు.. BRSV ప్రత్యేక గూగుల్ స్కానర్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మేము చిత్తుగా ఓడిపోయాం కానీ లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాం… ఈ రెండు ఎన్నికల మధ్య కోటి కొత్త ఓటర్లు పుట్టుకొచ్చారు అన్నారు. దీనిపై ఈసీకి లేఖ రాస్తే మాకు ఓటర్ లిస్ట్ ఇచ్చేందుకు ఎన్నికల కమిషన్ నిరాకరించింది అన్నారు.

