నేతన్నకు రూ.25000 భరోసా ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం చేనేతలను ఆదుకునేందుకు, అండగా నిలిచేందుకు నేతన్న భరోసా పేరుతో అదనంగా రూ.25000 ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు జాతీయ చేనేత దినోత్సవం సభలో ప్రకటించారు.
మంగళగిరిలో 11వ జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. భారతీయ శక్తి, సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక చేనేతలు.. నైపుణ్యం, సృజనాత్మకత కలయిక చేనేతలు.. ఆర్థిక ఇబ్బందులున్నా.. మొట్టమొదట గుర్తేచ్చేది చేనేత కార్మికులే అన్నారు.
Also Read:నిరుద్యోగ హామీలు.. BRSV ప్రత్యేక గూగుల్ స్కానర్
ఈనెల నుంచే 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నాం.. మరమగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తాం అన్నారు. ఉచిత విద్యుత్ వల్ల 93 వేల కుటుంబాలకు లబ్ధి కలగనుంది.. చేనేతలకు ఎంత ఇచ్చినా తక్కువే అవుతుంది…5,386 మందికి రూ.5 కోట్లు నిధులు విడుదల చేస్తున్నాం అన్నారు. 92,724 మందికి పింఛన్లు ఇస్తున్నాం.. రూ.546 కోట్లు ఖర్చు చేస్తున్నాం…నేతన్న భరోసా కింద అదనంగా రూ.25 వేలు ఇప్పించే బాధ్యత మాది అన్నారు.

