రాహుల్‌..ఔరంగజేబు

253
ahuja rahul
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజస్థాన్ బీజేపీ ఉపాధ్యక్షుడు జ్ఞాన్‌దేవ్ అహుజా. త్వరలో కాంగ్రెస్ సామ్రాజ్యం అంతరించి పోనుందని చెప్పారు. ఔరంగజేబు మొఘల్‌ సామ్రాజ్యానికి ఆఖరి చక్రవర్తి.. అలానే రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌కు చివరి అధ్యక్షుడన్నారు.

రాహుల్‌ గాంధీ తనును తాను హిందువుగా చెప్పుకుంటూ.. జంధ్యం ధరిస్తానని అంటున్నారు. మరి ఆయన చేత జంధ్యం ధరింపజేసిన బ్రాహ్మణుడి పేరు చెప్పగలరా’ అంటూ అహుజా ప్రశ్నించారు. అతి త్వరలోనే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని అభిప్రాయపడ్డారు.త్వరలో రాజస్తాన్‌లో జరగబోయే రామ్‌గఢ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

అయితే అహుజా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఆవులను దొంగతనం చేసే వారిని ఉగ్రవాదులంటూ విమర్శించిన ఆయన హనుమంతుడే తొలి ఆదివాసి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెక్స్,డ్రగ్స్‌కు జేఎన్‌యూ అడ్డాగా నిలిచిందని ఇండియాలో పెరుగుతున్న అత్యాచార ఘటనలను గాంధీ-నెహ్రూ కుటుంబానికి ఆపాదించారు. దేశంలోని అన్ని సామాజిక సమస్యలకూ నెహ్రూ కుటుంబమే కారణని విమర్శించారు.ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ వేలాది విగ్రహాలను నేలమట్టం చేసిన తరహాలోనే … గాంధీల పేరు పెట్టిన అన్ని విగ్రహాలు, మాన్యుమెంట్లను కూడా తక్షణం కూల్చివేయాల్సి ఉందని మాట్లాడి రాజకీయవర్గాల్లో సంచలనం రేపారు.

- Advertisement -