రైతు బిడ్డే… స్పీకర్:కేటీఆర్

189
ktr assembly

రైతు బిడ్డ శాసనసభ నాయకుడు కావడం గర్వంగా ఉందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత పోచారంను అభినందించిన కేటీఆర్ వ్యవసాయశాఖమంత్రిగా అద్భుతాలు సాధించారని చెప్పారు. 17 వేల కోట్ల రుణమాఫీ చేసి రైతు బంధు,రైతు బీమా వంటి పథకాలను తీసుకొచ్చిన పోచారంకే చెల్లిందన్నారు.

వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చిన కేసీఆర్ సీఎం కావడం, పోచారం స్పీకర్ కావడం రాష్ర్టాభివృద్ధికి శుభపరిణామం అన్నారు కేటీఆర్. రాష్ట్రంలో రెండో హరిత విప్లవానికి కూడా పోచారం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే బీజం పడింది అనడంలో ఎలాంటి అతిశయెక్తి లేదన్నారు.

వ్యవసాయంలో పరిశోధనలకు ఊతమిచ్చే విధంగా కొత్త పుంతలు తొక్కించారు. ఇవన్నీ కూడా పోచారం శ్రీనివాస్‌రెడ్డి హయాంలో జరిగిన కార్యక్రమాలు.. ఈ కార్యక్రమాలన్నీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు కేటీఆర్.

పోచారం శ్రీనివాస్ రెడ్డి తన వయసును లెక్క చేయకుండా ప్రజలతో సన్నిహితంగా, సత్సంబంధాలు పెట్టుకున్నారు. నిత్య విద్యార్థి మాదిరిగా శాసనసభలో ఉండిపోయేవారని కొనియాడారు. సభలో ప్రశ్నలు అడిగిన వారు లేకున్న వారు తమ నివాసాల్లో టీవీల్లో చూస్తుంటారు అని.. వారికి సమాధానం చెప్పాల్సిందేనని ఓపికగా సమాధానం చెప్పారని కేటీఆర్ తెలిపారు.