జయ అంత్యక్రియల్లో రాహుల్‌ నవ్వులు….

293
Rahul Gandhi Laughing At Jayalalitha's Funeral
- Advertisement -

తమిళనాడు రాజకీయాలను అత్యంతగా ప్రభావితం చేసిన ఓ స్త్రీ శక్తి సోమవారం రోజు అర్థరాత్రి కన్నుమూసింది. సెప్టెంబర్ 22న తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత..74 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి కన్నుమూశారు. యావత్తు తమిళ జాతి శోకసంద్రంలో మునిగిపోయింది. అమ్మ ఇక లేరన్న మరణవార్తను ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా ఆమె మరణం తీరని లోటు అని నేతలు అభిప్రాయపడుతున్నారు.

Rahul Gandhi Laughing At Jayalalitha's Funeral

జ‌య‌ల‌లిత అంత్య‌క్రియ‌లు మంగ‌ళ‌వారం సాయంత్రం మెరీనా బీచ్‌లో ఘ‌నంగా జ‌రిగాయి.కేంద్ర ప్ర‌భుత్వ అధికారిక లాంఛ‌నాల‌తో జ‌య‌ల‌లిత అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి.చందన‌పు పేటిక‌లో జ‌య‌ల‌లిత పార్దీవదేహం,గౌర‌వ సూచిక మేర‌కు సైనికులు గాలిలో 3 రౌండ్లు కాల్పులు జ‌రిపారు. ఎంజీఆర్ స‌మాధికి 20 అడుగుల దూరంలో జ‌య‌ల‌లిత స‌మాధిని ఏర్పాటు చేశారు. ఆమె అంత్యక్రియ‌లు చూడ‌టానికి త‌మిళ‌నాడు మొత్తం క‌ల‌సి వ‌చ్చింది. దేశం న‌లుమూల‌ల నుంచి జయ అభిమానులు అమ్మ పార్ధివదేహం తిల‌కించ‌డానికి అక్క‌డికి వ‌చ్చారు. అమ్మ‌ను చివ‌రి సారిగా చూడాల‌ని అలాంటి అమ్మ ఇంకా ఎవ‌రూ ఉండ‌ర‌ని,ఆమె మ‌న‌సు చాలా గొప్ప‌ద‌ని అమ్మ మ‌ర‌ణం మ‌ర‌చిపోలేని విషాదం అని అభిమానుల గుండెల్లో ధుఃఖ సంద్రాలు ఉప్పోంగుతున్నాయి. వారి గుండెల నిండా అమ్మ గురుతులే మిగిలాయి.అభిమానుల యొక్క దుఃఖానికి అవ‌దులు లేవు. అంత్య క్రియ‌ల‌లో కొంత మంది ప్ర‌ముఖులు హాజరయ్యారు వారిలో కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు, తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశ‌య్య , రాహుల్ గాంధీ, ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, మంత్రులు, ప‌లు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్‌లు ,సినీ నిర్మాత‌లు హాజ‌రైయ్యారు.

Rahul Gandhi Laughing At Jayalalitha's Funeral

అయితే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియల సమయంలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నవ్వుతూ కనిపిస్తున్న చిత్రాలు సోషల్‌ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆయన పక్కనున్న గులాం నబీ ఆజాద్‌ కూడా నవ్వుతూ మాట్లాడుతున్న ఫోటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలను షేర్‌ చేస్తున్న నెటిజన్లు రాహుల్‌గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తమిళ ప్రజలు ‘అమ్మ’గా కొలిచే ముఖ్యమంత్రి చనిపోయి రాష్ట్రమంతా శోకసంద్రంలో మునిగిపోతే… తామెందుకు వచ్చామోనన్న విషయం మరచిపోయి నవ్వుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి రాజకీయ నాయకులు దేశంలో ఉండటం యావత్తు ప్రజానికనికి సిగ్గుచేటు అని నెటిజన్లు సోషల్‌ మీడియాలో దుమ్మెత్తిపొస్తున్నారు. ఓవైపు తమిళ ప్రజలు అమ్మ చనిపోయిన బాధలో ఉంటే వీళ్లు ఇలా నవ్వడంపై ఇప్పుడు తమిళనాడులో తీవ్ర దుమారం రేగుతుంది.

https://youtu.be/lCRLkQVqP8E?t=41

- Advertisement -