అందరూ సెంచరీ వీరులే..

200
India’s Winning Streak Team
- Advertisement -

ఇంగ్లాండ్ తో నాలుగో టెస్టులో భారత జట్టు ఓ అరుదైన ఘనత సాధించింది. ఇంగ్లండ్ తో ముంబైలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆడుతున్న టీమిండియా ఆటగాళ్లంతా సెంచరీ వీరులే. బ్యాట్స్ మెన్లు, బౌలర్లు, వికెట్ కీపర్ అందరూ శతకాలు బాదిన వాళ్లే. 1992-93లో జింబాబ్వేతో ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో కూడా… ఇదే విధంగా తుది జట్టులో అందరూ సెంచరీ వీరులే ఉన్నారు. ఇలాంటి ఘటనలు ఇండియన్ క్రికెట్ హిస్టరీలో తొమ్మిదిసార్లు జరిగింది.

ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సెంచరీలు చేసిన ఆటగాళ్లతో కూడిన భారత జట్టు క్రికెట్ ఆడటం మాత్రం ఇదే తొలిసారి. టీమిండియా తుది జట్టులోని 11 మంది ఆటగాళ్లు ఫస్ట్ క్లాస్ కెరియర్లో కనీసం ఒక సెంచరీ అయినా చేశారు. ఈ మ్యాచ్ లో మురళీ విజయ్, కేఎల్ రాహుల్, పుజారా, కోహ్లీ, కేకే నాయర్, అశ్విన్, పార్థివ్ పటేల్, జడేజా, జయంత్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్ లు ఆడుతున్నారు.ప్రస్తుత జట్టులో ఉన్న బ్యాట్స్‌మెన్ మాత్రమే కాకుండా భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్ లాంటి బౌలర్లు కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సెంచరీలు బాదారు.

ఒకప్పటి టీమిండియా జట్టులో నాలుగు వికెట్లు పడితే అంతే. మిగతా బ్యాట్స్‌మెన్ అందరూ సైకిల్ స్టాండ్ తరహాలో పెవిలియన్‌కు క్యూ కట్టేవారు. కానీ ప్రస్తుత బ్యాటింగ్ ఆర్డర్ చాలా మెరుగైంది. చివరి వరుస బ్యాట్స్‌మెన్ కూడా పోరాడుతున్నారు.

- Advertisement -