రక్షణమంత్రిపై వ్యాఖ్యలు…రాహుల్‌కు నోటీసులు

279
rahul
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి షాక్ తగిలింది. రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌పై రాహుల్‌ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తనను కాపాడుకోవడానికి ఓ మహిళ దొరికారు అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఆయన మాటలపై మహిళా కమిషన్‌ అభ్యంతరం వ్యక్తంచేసింది.

రాహుల్‌ మహిళల్ని గౌరవించాలని కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ వెల్లడించారు. రాహుల్ తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని,
నిర్మలా సీతారామన్‌కు క్షమాపణలు చెప్పాలన్నారు. ఆమె రక్షణ శాఖ మంత్రి అని, ఓ పార్టీ అధ్యక్షుడి నుంచి ఇలాంటి వ్యాఖ్యలను తాము ఊహించలేదని తెలిపారు.

56 అంగుళాల ఛాతీ గల వాచ్‌మ్యాన్‌ పారిపోయి ఓ మహిళకు చెప్పారు.. సీతారామన్‌ జీ, నన్ను కాపాడండి.. నన్ను నేను కాపాడుకోలేను అని అడిగారు. రెండున్నర గంటల పాటు ఆమె ఆయనను రక్షించలేకపోయారు. నేను నేరుగా ఓ ప్రశ్న అడిగాను. యస్‌ లేదా నో అని సమాధానం చెప్పమన్నాను. కానీ ఆమె చెప్పలేదు అని రాహుల్‌ ఓ ర్యాలీలో అన్నారు.

- Advertisement -