Rahul:రాజ్యాంగాన్ని కాపాడండి

13
- Advertisement -

మరోసారి స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు శుభాకాంక్షలు తెలిపారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్…రాజ్యాంగాన్ని పరీరక్షించేందుకు చొరవ తీసుకోవాలని… ప్రజల గొంతుకను వినిపించేందుకు అనుమతించాలని కోరారు.

సభా నిర్వహణలో తాము పూర్తిగా సహకరిస్తామని…పక్షం మాట్లాడేందుకు అనుమతించడంతో పాటు భారత ప్రజల పక్షాన తమ ప్రాతినిధ్యాన్ని అనుమతిస్తారనే విశ్వాసం ఉందన్నారు.

స్వాతంత్య్రానంతరం లోక్‌సభ స్పీకర్ పదవికి ఇది మూడో ఎన్నిక. ఎన్డీయే అభ్యర్థికి 297 మంది ఎంపీల మద్దతు ఉండగా, ఆప్‌కు 232 మంది ఎంపీల మద్దతు లభించింది. స్పీకర్‌గా ఓం బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదిస్తూ తీర్మానం ప్రవేశపెట్టగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ బలపరిచారు.

Also Read:Kaushik Reddy:పొన్నం నుండే బ్లాక్ బుక్‌ స్టార్ట్

- Advertisement -