రైతు వ్యతిరేక ప్రభుత్వం గద్దె దిగాలి:రాహుల్

295
Rahul Gandhi
- Advertisement -

రైతు వ్యతిరేక మోడీ సర్కార్‌ గద్దె దిగాలన్నారు కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ. ఆలిండియా కిసాన్ సంఘర్ష్ సమన్వయ్ సమితి ఆధ్వర్యంలో లక్షలాది రైతులు న్యూఢిల్లీలోని రామ్ లీలా మైదానం వద్ద నిరసన ప్రదర్శన చేయగా రాహుల్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మోడీపై నిప్పులు చెరిగారు రాహుల్.దేశ రైతాంగం కోసం ప్రధానిని మార్చాల్సి వస్తే మార్చి తీరతామని మోడీని, బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

దేశంలో రెండే పెద్ద సమస్యలున్నాయని ఒకటి దేశ రైతుల సమస్యలు,రెండోది దేశ యువత ఉద్యోగాల సమస్య అని చెప్పారు. తాము ఈ రెండు సమస్యలపైనే పోరాడుతున్నట్టు తెలిపారు. కేవలం 15 మంది పారిశ్రామికవేత్తల కోసం ప్రధాని మోడీ రూ.3,50,000 కోట్ల రుణాన్ని రద్దు చేశారని ఆరోపించారు. రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో కుంభకోణం జరిగిందని మండిపడ్డారు.

Rahul Gandhi ప్రధాని మోడీ కేవలం తనకు మద్దతిచ్చే పారిశ్రామికవేత్తల కోసమే మాట్లాడుతున్నారని రాహుల్ దుయ్యబట్టారు. దేశాన్ని ఏక వ్యక్తి కానీ, ఒకే పార్టీ కానీ పరిపాలించలేవన్నారు. భారతదేశాన్ని రైతులు, యువత, కార్మికులు నిర్మించారన్నారు. తాము వారితోనే ఉంటామన్నారు. అన్నదాతలు ఏవో తాయిలాలను అడగటం లేదని, కేవలం వారి హక్కులనే కోరుతున్నారని చెప్పారు.

- Advertisement -