- Advertisement -
త్వరలో టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) హెడ్‌గా ఉన్న రాహుల్..జూలైలో శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల జట్టుకు టీమ్ ఇండియా కోచ్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇండియన్ ప్లేయర్లకు పదును పెట్టిన ద్రవిడ్… ఇప్పుడు ఈ యంగ్ టీమ్‌కు మార్గనిర్దేశకుడిగా వ్యవహరించడం జట్టుకు బలాన్ని ఇస్తుందని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. అయితే దీనికి సంబంధించి బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత 2014లో ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత జట్టుకి బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహరించారు రాహుల్ ద్రావిడ్. భారత క్రికెట్ వాల్‌గా పేరుగాంచిన రాహుల్…జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించారు.
- Advertisement -