పన్ను చెల్లింపు దారులకు ఊరట..

147
it
- Advertisement -

పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించే వార్తను అందించింది కేంద్రం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు గడువును పొడిగించింది. మరో రెండు నెలలపాటు గడువును పొడగించగా 2021 సెప్టెంబర్ 30 వరకు ఐటీఆర్ దాఖలుకు గడువు లభించింది.

ప్రస్తుతం ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ డెడ్‌లైన్ జూలై 31గా ఉంది. ఐటీఆర్ డెడ్‌లైన్ గడువు పొడిగింపు నిర్ణయం వల్ల పన్ను చెల్లింపుదారులకు ఊరట కలుగనుంది. 2021-22 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలుకు గడువు జూలై 31గా ఉంది. ఈ గడువును 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నాం అని సీబీడీటీ తెలిపింది.

రివైజ్డ్ లేదా ఆలస్యమైన ఐటీఆర్ దాఖలుకు గడువు 2021 డిసెంబర్ 31 వరకు ఉంది. ఈ గడువును ఇప్పుడు సీబీడీటీ 2022 జనవరి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -